alt
బ్రేకింగ్ న్యూస్

టాప్ స్టోరీస్

సినిమా

జిల్లా వార్తలు

లేటెస్ట్ న్యూస్

  • post

    రేపు అమరావతి పనులకు సీఎం శంకుస్థాపన

    సీఎం చంద్రబాబు రాజధాని పనులకు రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈనెల 12 నుంచి పలు ప్రైవేట్ సంస్థలు తమ నిర్మాణాలను విస్తరించనున్నాయి. ఎస్ఆర్ఎంలో రూ.700 కోట్లతో కొత్త విభాగాల నిర్మాణం, విట్‌లో వసతి గృహాలు, అకడమిక్ భవనాల ఏర్పాటుతోపాటు 4 కొత్త భవనాలు నిర్మించేందుకు అమృత్ వర్సిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది.

  • post

    బీద రవిచంద్రకు మంత్రి లోకేష్ అభినందన

    ఎమ్మెల్యే కోటా నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన టీడీపీ సీనియర్ నేత బీద రవిచంద్ర మంత్రి లోకేష్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాసమస్యలను శాసన మండలి దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా రవిచంద్రకు లోకేష్ అభినందనలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఉన్నారు.

  • post

    సీఎంను క‌లిసిన శాప్ ఛైర్మ‌న్

    ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌లో సీఎం నారా చంద్ర‌బాబునాయుడుని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు శుక్ర‌వారం మర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సంద‌ర్భంగా ఏపీ క్రీడాభివృద్ధికి సంబంధించిన క్రీడాంశాల‌పై చ‌ర్చించారు.ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న క్రీడాప్రోత్సాహ‌కాల‌ను విడుద‌ల చేయ‌డం ప‌ట్ల సీఎం చంద్ర‌బాబుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వ‌చ్చే బ‌డ్జెట్‌లో క్రీడ‌ల అభివృద్ధికి మ‌రిన్ని నిధులు కేటాయించాల‌ని శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు సీఎంకు విజ్ఞ‌ప్తి చేశారు.రాష్ట్ర క్రీడాభివృద్ధికి దోహ‌ద‌ప‌డే ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌ను సీఎం దృష్టికి తీసుకెళ్ల‌గా నిర్ధిష్ట‌మైన ప్రణాళిక‌ల‌ను సిద్ధం చేస్తే త్వ‌ర‌లోనే అధ్య‌య‌నం చేసి కార్యాచ‌ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం బదులిచ్చినట్లు ర‌వినాయుడు తెలిపారు. 

క్రైం

  • post

    సీతారాం ఏచూరి కన్నుమూత

    ప్రముఖ రాజకీయవేత్త, భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. శ్వాసకోస, ఇతర ఆరోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) లో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్‌లో చేరారు. 1952 ఆగస్టు 12న చెన్నై లో జన్మించిన సీతారాం ఏచూరి 1974లో ఎస్ఎఫ్ఐ చేరారు. 1975లో సిపిఎం ప్రాధమిక సభ్యత్యాన్ని తీసుకున్నారు. 1985లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నిక‌య్యారు.

  • post

    ఏపీలో 3రోజుల‌పాటు ప‌లు రైళ్లు ర‌ద్దు

    విజయవాడ డివిజన్‌లో సాంకేతిక పనుల కార‌న‌ణంగా శుక్ర‌వారం నుంచి ఈనెల 8, 9 తేదీల వరకూ 44రైళ్ల‌ను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. (07575)తెనాలి టు విజయవాడ ట్రైన్‌, (07500)విజయవాడ టు గూడూరు ట్రైన్‌, (07896)మచిలీపట్నం టు విజయవాడ ట్రైన్‌, (07769) విజయవాడ టు మచిలీపట్నం ట్రైన్‌, (07871/07872)మచిలీపట్నం టు గుడివాడ వెళ్లే ట్రైన్‌, (07898/07899) మచిలీపట్నం- విజయవాడ ట్రైన్‌, (07461) విజయవాడ టు ఒంగోలు వెళ్లే ట్రైన్, 07576 ఒంగోలు టు విజయవాడ, 07867 మచిలీపట్నం టు విజయవాడ వెళ్లే రైళ్లను రద్దు చేశారు.

  • post

    ఆర్బీఐ క్విజ్.. ఫస్ట్ ప్రైజ్ రూ.10 లక్షలు

    ఆర్బీఐ 90 వసంతాల వేళ డిగ్రీ విద్యార్ధులకు భారీ ప్రైజ్ మనీతో కూడిన క్విజ్ పోటీలను నిర్వహిస్తోంది. ఈ క్విజ్ పోటీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న విద్యార్ధులు సెప్టెంబర్ 17 రాత్రి 9 గంటల వరకూ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 19 నుండి 21వ తేదీల్లో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ, రిజర్వు బ్యాంకు గురించి అవగాహన, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1నాటికి 25ఏళ్ల లోపు ఏదైనా డిగ్రీ చదువుతున్న విద్యార్ధులు అర్హులు.

రాజకీయం

alt
alt

ఎడిట్ పేజీ

టెక్నాలజీ

ప్రపంచం

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Instagram