
మహబూబాబాద్ వద్ద రైల్వేట్రాక్ పునరుద్దరణ
Updated on: 2024-09-04 11:15:00

మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్ద మోరీ వద్ద వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ట్రాక్ దెబ్బతిన్న ప్రాంతంలో రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. 36గంటల్లోనే ట్రాక్ మరమ్మతుల పనులు పూర్తి చేశారు. రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తికాడంతో సింగిల్ రైల్వే ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. ఆ ట్రాక్ పై ట్రయల్ రన్ నిర్వహించారు. రైల్వే ఉన్నతాధికారుల నుంచి క్లియరెన్స్ వస్తే ఈరోజు నుంచే ఆ ట్రాక్ గుండా రైళ్ల రాకపోకలు సాగనున్నాయి.