
క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం
Updated on: 2024-10-19 05:49:00

రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని, గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన క్రీడారంగానికి సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారధ్యంలో పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని మొఘళ్లపాలెంలో జరుగుతున్న మల్టీపర్పస్ ఇండోర్ హాలు, నెల్లూరు పట్టణంలోని ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంను శనివారం ఆయన పరిశీలించారు. తొలుత మల్టీపర్పస్ ఇండోర్ హాలులో జరిగిన పనులను పరిశీలించి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో ఆయన సమీక్షించారు.