alt
బ్రేకింగ్ న్యూస్

Related Post

post

రాష్ట్ర ప్ర‌భుత్వం క్రీడారంగంపై ప్ర‌త్యేక దృష్టి సారించింద‌ని, గ‌త ప్ర‌భుత్వంలో నిర్వీర్య‌మైన క్రీడారంగానికి సీఎం చంద్ర‌బాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సార‌ధ్యంలో పూర్వ వైభ‌వాన్ని తీసుకొస్తామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్‌) ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని మొఘ‌ళ్ల‌పాలెంలో జ‌రుగుతున్న మ‌ల్టీప‌ర్ప‌స్ ఇండోర్ హాలు, నెల్లూరు ప‌ట్ట‌ణంలోని ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంను శ‌నివారం ఆయ‌న ప‌రిశీలించారు. తొలుత మ‌ల్టీప‌ర్ప‌స్ ఇండోర్ హాలులో జ‌రిగిన ప‌నులను ప‌రిశీలించి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారుల‌తో ఆయ‌న స‌మీక్షించారు.

post

విజ‌య‌వాడ‌: కూట‌మి ప్ర‌భుత్వంలో శాప్ కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ ఇక‌పై ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఉంటుంద‌ని, గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలా కాకుండా క్రీడారంగం అభివృద్ధే అజెండాగా శాప్ ప‌నిచేస్తుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్‌) ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు పేర్కొన్నారు. విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలోని శాప్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా శాప్ ఛైర్మ‌న్ మాట్లాడుతూ శాప్ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాక నెల్లూరు, తిరుప‌తి, హిందూపురం, శ్రీ‌కాళ‌హ‌స్తి, పూత‌ల‌ప‌ట్టు, చిత్తూరు, తెనాలి వంటి ప్రాంతాల్లో ప‌ర్య‌టించి కేవీకే నిర్మాణాలు, ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియంల నిర్మాణాల‌ను ప‌రిశీలించామ‌న్నారు. 

post

ఈనెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వ‌ర‌కూ జ‌మ్మూలో జ‌రిగిన 37వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియ‌న్‌షిప్ పోటీల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాకారులు అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు. స‌బ్‌-జూనియ‌ర్స్ విభాగంలో ద్వితీయ‌, తృతీయ స్థానాలను ఆంధ్ర‌ప్ర‌దేశ్ కైవసం చేసుకుంది. రెండ‌వ స్థానంలో బాలిక‌ల జ‌ట్టు, మూడవ స్థానంలో బాలుర జ‌ట్టు విజ‌యం సాధించ‌డం ప‌ట్ల శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు గారు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. జాతీయస్థాయి పోటీల్లో స‌త్తా చాటి రాష్ట్ర ఖ్యాతిని పెంచ‌డం సంతోష‌దాయ‌కమ‌ని హ‌ర్షించారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ప‌త‌కాలు సాధించి ఏపీని అగ్ర‌స్థానంలో నిల‌బెట్టాల‌న్నారు.

post

ఢిల్లీలో జ‌రిగిన ఖోఖో పురుషుల ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు విజేత‌గా నిల‌వ‌డం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా 19 దేశాలు త‌ల‌ప‌డ‌గా భార‌త‌జట్టు ప్ర‌ద‌ర్శించిన ప్రతిభ అద్భుత‌మ‌ని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో జ‌రిగిన ఖోఖో ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో నేపాల్‌పై భార‌త్ విజ‌యం సాధించి ప్ర‌పంచ విజేత‌గా నిల‌వ‌డం ప‌ట్ల శాప్ ఛైర్మ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా భార‌త‌జ‌ట్టుకు శాప్ త‌రుపున అభినందన‌లు తెలియ‌జేశారు. ముఖ్యంగా భార‌త జ‌ట్టులో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన ప్ర‌కాశం జిల్లా క్రీడాకారుడు పి.శివారెడ్డికి ఆయ‌న ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలియ‌జేశారు. 

post

ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌లో సీఎం నారా చంద్ర‌బాబునాయుడుని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు శుక్ర‌వారం మర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సంద‌ర్భంగా ఏపీ క్రీడాభివృద్ధికి సంబంధించిన క్రీడాంశాల‌పై చ‌ర్చించారు.ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న క్రీడాప్రోత్సాహ‌కాల‌ను విడుద‌ల చేయ‌డం ప‌ట్ల సీఎం చంద్ర‌బాబుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వ‌చ్చే బ‌డ్జెట్‌లో క్రీడ‌ల అభివృద్ధికి మ‌రిన్ని నిధులు కేటాయించాల‌ని శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు సీఎంకు విజ్ఞ‌ప్తి చేశారు.రాష్ట్ర క్రీడాభివృద్ధికి దోహ‌ద‌ప‌డే ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌ను సీఎం దృష్టికి తీసుకెళ్ల‌గా నిర్ధిష్ట‌మైన ప్రణాళిక‌ల‌ను సిద్ధం చేస్తే త్వ‌ర‌లోనే అధ్య‌య‌నం చేసి కార్యాచ‌ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం బదులిచ్చినట్లు ర‌వినాయుడు తెలిపారు. 

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Instagram