
యువత ముందుకు రావాలి
Updated on: 2024-09-04 12:06:00

విజయవాడ ముంపు బాధితులకు స్వచ్ఛంద సంఘాలు, ప్రభుత్వ, ప్రతిపక్షాలు సకాలంలో ఫుడ్, వాటర్, మిల్క్ అందజేస్తున్నాయి. పక్క జిల్లాల నుంచి దాతలు ముందుకువచ్చి ఫుడ్ తీసుకొస్తున్నారు. వాటిని తీసుకొచ్చి ఒకచోట పెడుతున్నారే తప్ప బాధితులకు వాటిని డెలివరీ చేసేందుకు పూర్తి స్థాయిలో సిబ్బంది లేరు. చుట్టుపక్కల ఉన్న యువత వరద బాధితులకు సహాయం చేసేందుకు ముందుకురావాలి. ఫుడ్ సమృద్ధిగా ఉన్నా వాటిని బాధితులకు అందజేయలేకపోతున్న పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఉంది. కాబట్టి యువత ముందుకువచ్చి వాటిని సరఫరా చేయాలి. సింగ్‌నగర్ వచ్చి నా నెంబర్ 81212 36061కి కాల్ చేస్తే లొకేషన్ చెప్తానని సోషల్ యాక్టివిస్ట్, VK TALKS ఫౌండర్ వినీల్ పిలుపునిచ్చారు.