
తృటిలో తప్పిన ముప్పు..
Updated on: 2025-01-28 12:04:00

సామర్లకోటకు చెందిన ఓ ప్రైవేటు స్కూల్ బస్సు వడ్లమూరులోని ప్రభుత్వ పాఠశాల రోడ్డులో అదుపుతప్పింది. దివిలి నుంచి విద్యార్థులతో వస్తూ వడ్లమూరులోని మరో ఐదుగురు విద్యార్థులను ఎక్కించుకుని వస్తుండగా బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తూ బస్సులోని విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు పోతుల వీరప్రభాకర్, మోటూరి వీరబాబులు సంఘటనాస్థలానికి చేరుకుని విద్యార్థులకు చికిత్స ఏర్పాట్లు చేశారు. స్కూల్ బస్సుల విషయంలో యాజమాన్యాలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.