
ప్రణాళికాబద్ధంగా శాప్ కార్యకలాపాలు
Updated on: 2024-10-29 07:01:00

విజయవాడ: కూటమి ప్రభుత్వంలో శాప్ కార్యకలాపాల నిర్వహణ ఇకపై ప్రణాళికాబద్ధంగా ఉంటుందని, గత వైసీపీ ప్రభుత్వంలా కాకుండా క్రీడారంగం అభివృద్ధే అజెండాగా శాప్ పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని శాప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ శాప్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టాక నెల్లూరు, తిరుపతి, హిందూపురం, శ్రీకాళహస్తి, పూతలపట్టు, చిత్తూరు, తెనాలి వంటి ప్రాంతాల్లో పర్యటించి కేవీకే నిర్మాణాలు, ఇండోర్, అవుట్డోర్ స్టేడియంల నిర్మాణాలను పరిశీలించామన్నారు.