
ఈరోజే మరో అల్పపీడనం
Updated on: 2024-09-05 10:09:00

రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఈనెల 9 వరకూ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ ప్రభావం విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయని తెలిపింది. గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.