
ప్రతి రాష్ట్రంలోనూ ‘హైడ్రా’ ఉండాలి
Updated on: 2024-09-04 03:55:00

తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ లాంటివి ప్రతి రాష్ట్రంలోనూ ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో బుధవారం ఆయన ఆయా జిల్లాల కలెక్టర్లతో వరదలపై సమీక్షించారు. పొరుగు రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్, బఫర్ల జోన్ల పరిరక్షణమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ అభినందనీయమన్నారు. నిజంగా సీఎం రేవంత్రెడ్డి చెరువుల విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.