
పెద్దాపురం రైతాంగం అప్రమత్తంగా ఉండాలి
Updated on: 2024-09-04 04:53:00

ఏలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న పెద్దాపురం మండలంలోని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు ఎలిశెట్టి నాని పేర్కొన్నారు. ఏలేరు రిజర్వాయర్‌కు 20.2 టీఎంసీల నీరు చేరుకుందని, నీరు వదలాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారన్నారు. బుధవారం సాయంత్రం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారని, పెద్దాపురం,పిఠాపురం నియోజక వర్గాల వైపు నీరు మళ్ళుతుందని అన్నారు. కాబట్టి పెద్దాపురం మండలంలోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.