alt
బ్రేకింగ్ న్యూస్

Related Post

post

విజ‌య‌వాడ ముంపు బాధితుల‌కు స్వ‌చ్ఛంద సంఘాలు, ప్ర‌భుత్వ‌, ప్ర‌తిప‌క్షాలు స‌కాలంలో ఫుడ్, వాట‌ర్‌, మిల్క్ అంద‌జేస్తున్నాయి. ప‌క్క జిల్లాల నుంచి దాత‌లు ముందుకువ‌చ్చి ఫుడ్ తీసుకొస్తున్నారు. వాటిని తీసుకొచ్చి ఒక‌చోట పెడుతున్నారే త‌ప్ప బాధితుల‌కు వాటిని డెలివ‌రీ చేసేందుకు పూర్తి స్థాయిలో సిబ్బంది లేరు. చుట్టుప‌క్క‌ల ఉన్న యువ‌త వరద బాధితులకు సహాయం చేసేందుకు ముందుకురావాలి. ఫుడ్ స‌మృద్ధిగా ఉన్నా వాటిని బాధితుల‌కు అంద‌జేయ‌లేక‌పోతున్న ప‌రిస్థితుల్లో అధికార యంత్రాంగం ఉంది. కాబ‌ట్టి యువ‌త ముందుకువ‌చ్చి వాటిని స‌ర‌ఫ‌రా చేయాలి. సింగ్‌న‌గ‌ర్ వ‌చ్చి నా నెంబ‌ర్ 81212 36061కి కాల్ చేస్తే లొకేష‌న్ చెప్తాన‌ని సోష‌ల్ యాక్టివిస్ట్‌, VK TALKS ఫౌండ‌ర్ వినీల్‌ పిలుపునిచ్చారు. 

post

ఏలేరు వ‌ర‌ద నీటిని విడుద‌ల చేసేముందు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు ప్రాంత ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాల‌ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పిఠాపురంలో జగనన్న కాలనీ ఇప్పటికే మంపులో ఉంద‌న్నారు. ఈబీసీ కాలనీ, సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా, సీతానగరం, లక్ష్మణపురం, మల్లవరం, ఎ.విజయనగరం, ఏకే మల్లవరం గ్రామాలవారిని అప్రమత్తం చేయాల‌న్నారు. ముంపు గ్రామాల ప్రజలకు అవసరమైన ఆహారం, తాగునీరు, ఔషధాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాల‌న్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయం చేసుకొని రైతాంగానికి, ప్రజలకి ధైర్యం చెప్పాల‌న్నారు. 

post

ప్ర‌జాప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా కూట‌మి ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి బోళ్ల వెంక‌ట‌ర‌మ‌ణ పేర్కొన్నారు. పెద్దాపురం మండ‌లం వ‌డ్ల‌మూరులో నిర్వ‌హించిన ప్ర‌జావేదిక కార్య‌క్ర‌మంలో ఆయ‌న  మాట్లాడారు. జ‌గ‌న్ రాక్ష‌సపాల‌న అనంత‌రం మూడు నెల‌ల‌ కూట‌మి ప్ర‌భుత్వపాల‌న ప్ర‌జ‌లంద‌రికీ స్వ‌ర్ణ‌యుగంలా ఉంద‌న్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజ‌ప్పతో క‌లిసి స్థానికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. జ‌న‌సేన‌పార్టీ కాకినాడ జిల్లా అధ్య‌క్షుడు తుమ్మ‌ల రామ‌స్వామి(బాబు), కూట‌మి నాయ‌కులు పాల్గొన్నారు. 

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Instagram