
భారత ఖోఖో జట్టుకు శాప్ ఛైర్మన్ అభినందన
Updated on: 2025-01-19 10:30:00

ఢిల్లీలో జరిగిన ఖోఖో పురుషుల ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా 19 దేశాలు తలపడగా భారతజట్టు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఖోఖో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌పై భారత్ విజయం సాధించి ప్రపంచ విజేతగా నిలవడం పట్ల శాప్ ఛైర్మన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారతజట్టుకు శాప్ తరుపున అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా భారత జట్టులో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రకాశం జిల్లా క్రీడాకారుడు పి.శివారెడ్డికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.