
ప్రజాప్రతినిధుల సహకారం అవసరం
Updated on: 2024-10-29 06:27:00

తిరుపతి: క్రీడారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకుల సమావేశంలో సోమవారం ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ ఏపీలో 2014 నుంచి 2019 మధ్యలో చేపట్టిన కేవీకేలు, ఇండోర్ అవుట్డోర్, మల్టీపర్పస్ స్టేడియంల నిర్మాణాలు 90శాతం పూర్తయ్యాయని, వైసీపీ ప్రభుత్వం వల్ల ఆ పనులన్నీ పెండింగ్లో ఉన్నాయన్నారు. మళ్లీ అధికారంలోనికి వచ్చిన కూటమి ప్రభుత్వం క్రీడారంగంపై దృష్టి సారిస్తుందన్నారు.