
ప్రజాప్రయోజనాలే కూటమి లక్ష్యం
Updated on: 2024-09-20 02:53:00

ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ల వెంకటరమణ పేర్కొన్నారు. పెద్దాపురం మండలం వడ్లమూరులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జగన్ రాక్షసపాలన అనంతరం మూడు నెలల కూటమి ప్రభుత్వపాలన ప్రజలందరికీ స్వర్ణయుగంలా ఉందన్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పతో కలిసి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జనసేనపార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి(బాబు), కూటమి నాయకులు పాల్గొన్నారు.