
పిఠాపురం రైతులను అప్రమత్తం చేయండి
Updated on: 2024-09-04 04:19:00

ఏలేరు వరద నీటిని విడుదల చేసేముందు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు ప్రాంత ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పిఠాపురంలో జగనన్న కాలనీ ఇప్పటికే మంపులో ఉందన్నారు. ఈబీసీ కాలనీ, సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా, సీతానగరం, లక్ష్మణపురం, మల్లవరం, ఎ.విజయనగరం, ఏకే మల్లవరం గ్రామాలవారిని అప్రమత్తం చేయాలన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు అవసరమైన ఆహారం, తాగునీరు, ఔషధాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయం చేసుకొని రైతాంగానికి, ప్రజలకి ధైర్యం చెప్పాలన్నారు.