
బాపట్లలో 86 వేల ఎకరాల్లో పంట నష్టం
Updated on: 2024-09-06 11:35:00

బాపట్ల జిల్లాలోని పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. వరద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న వేమూరు, రేపల్లే నియోజకవర్గాల్లోని లంకగ్రామాలు నీటమునగడంతో జిల్లాలో 86 వేల ఎకరాల్లో వ్యవసాయ పంటలు గడిచిన ఐదు రోజులుగా నీటిలోనే ఉండిపోయాయి. 1,279 ఎకరాల్లో ఉద్యాన పంటలు వరద నీటిలోనే ఉరకలెత్తుతున్నాయి. అరటి, పసుపు. కంద, తమలపాకుల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరిసాగుపై వరద తీవ్ర ప్రభావం పడింది. పంట నష్టం అంచనాలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటల సర్వే కోసం 161 మంది వ్యవసాయ సహాయకులు సర్వేలో పాల్గొంటున్నారు.