
ఏలేరు దగ్గర గ్రామాలు అప్రమత్తం
Updated on: 2024-09-04 04:10:00

ఏలేరు ప్రాజెక్టు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై బుధవారం ఆయన అధికార యంత్రాంగంతో మాట్లాడారు. ప్రజలకు నిత్యావసరాలు, ఆహారం, తాగునీరు, ఔషధాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఏలేరు రిజర్వాయర్ కి 20.2 టీఎంసీల నీరు చేరుకుందని, నీరు వదలాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు. బుధవారం సాయంత్రం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు. పిఠాపురం, పెద్దాపురం నియోజక వర్గాల వైపు నీరు మళ్ళుతుందన్నారు.