
పవన్ సేవలకు సీఎం చంద్రబాబు ఫిదా
Updated on: 2024-09-05 10:35:00

వరదల సహాయక చర్యల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం భారీ విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ను ఆయన అభినందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ను ప్రశంసిస్తూ చంద్రబాబు పోస్ట్ పెట్టారు. వరదల కారణంగా కష్టాలలో ఉన్న ప్రజలకు ఆయన చేస్తున్న సేవలు నిరుపమానమని కొనియాడారు. ఇప్పటివరకూ ఇలాంటి నాయకుణ్ని చూడలేదని ఫిదా అయ్యారు.