
హంపి విజయం హర్షణీయం
Updated on: 2024-12-29 12:42:00

న్యూయార్క్ వాల్స్ట్రీట్లో జరిగిన ఫిడే-2024 ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో తెలుగుజాతి ఆడబిడ్డ కోనేరు హంపి విజేతగా నిలవడం హర్షించదగ్గ విజయమని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరీన్ సుకందర్పై విజయం సాధించి తెలుగుజాతి కీర్తిప్రతిష్టతలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపచేసినందుకు ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆమె విజయం యావత్ తెలుగుజాతికి గర్వకారణమని, ఆమె పట్టుదల, అంకితభావం, సంకల్పానికి నిదర్శనమని కొనియాడారు.