
ఆర్బీఐ క్విజ్.. ఫస్ట్ ప్రైజ్ రూ.10 లక్షలు
Updated on: 2024-09-06 11:03:00

ఆర్బీఐ 90 వసంతాల వేళ డిగ్రీ విద్యార్ధులకు భారీ ప్రైజ్ మనీతో కూడిన క్విజ్ పోటీలను నిర్వహిస్తోంది. ఈ క్విజ్ పోటీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న విద్యార్ధులు సెప్టెంబర్ 17 రాత్రి 9 గంటల వరకూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 19 నుండి 21వ తేదీల్లో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ, రిజర్వు బ్యాంకు గురించి అవగాహన, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1నాటికి 25ఏళ్ల లోపు ఏదైనా డిగ్రీ చదువుతున్న విద్యార్ధులు అర్హులు.