
జి.రాగంపేటలో ఇన్స్యూరెన్స్‌ల నమోదు
Updated on: 2024-09-17 04:23:00

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా పెద్దాపురం మండలం జి.రాగంపేటలో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ ఇన్సూరెన్స్ డ్రైవ్‌ను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మందికిపైగా ఈ-శ్రమ్‌లో నమోదయ్యారు. ఇన్స్యూరెన్స్‌ల నమోదుతో నష్టపోయిన కుటుంబాలకు భరోసా కలుగుతుందని గ్రామ బీజేపీ నాయకులు పేర్కొన్నారు. గొరకపూడి చిన్నయ్య దొర, తుమ్మల పద్మజా లక్ష్మి, పోతుల ప్రభాకర్, మనం-మనఊరు టీం సభ్యులు పాల్గొన్నారు.