
బ్యారేజీపై పడవలను కావాలనే వదిలారా?
Updated on: 2024-09-04 03:48:00

ప్రకాశం బ్యారేజీపై పడవలను కావాలనే ఎవరైనా వదిలారా ? బాధ్యులను గుర్తించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరదను షర్మిలా రెడ్డి పరిశీలించారు. వరదకు కొట్టుకువచ్చిన పడవల ధాటికి విరిగిపోయిన గేట్లను పరిశీలించారు. అనంతరం షర్మిలా మాట్లాడుతూ పడవలు కావాలనే వదిలారా ? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులు ఎవరో గుర్తించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.