
ముంపు ప్రాంతాల్లో షర్మిల పర్యటన
Updated on: 2024-09-12 03:20:00

కాకినాడ జిల్లా పెద్దాపురం శివారు ఏలేరు కాలువ దిగువన నీటమునిగిన పంట పొలాలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి గురువారం పరిశీలించారు. నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పదేళ్లుగా ఏలేరు ఆధునికీకరణపై జగన్, చంద్రబాబులకు పట్టింపులేదన్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 6లక్షల ఎకరాలు నీటమునిగాయన్నారు. నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇచ్చేలా ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తుమ్మల దొరబాబు పాల్గొన్నారు.