
సీతారాం ఏచూరి కన్నుమూత
Updated on: 2024-09-12 04:27:00

ప్రముఖ రాజకీయవేత్త, భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. శ్వాసకోస, ఇతర ఆరోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్తో ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్‌లో చేరారు. 1952 ఆగస్టు 12న చెన్నై లో జన్మించిన సీతారాం ఏచూరి 1974లో ఎస్ఎఫ్ఐ చేరారు. 1975లో సిపిఎం ప్రాధమిక సభ్యత్యాన్ని తీసుకున్నారు. 1985లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు.