
దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్
Updated on: 2025-01-18 01:23:00

స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్థంతిని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నర్సింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శాప్ ఛైర్మన్ రవినాయుడు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. ఆయనకు తిరుపతితో విడదీయలేని బంధం ఉందన్నారు. తిరుపతి వేదికగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, రాష్ట్రవ్యాప్తంగా అనేక సంస్కరణలను తీసుకొచ్చారని కొనియాడారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనేది తిరుపతి ప్రజానీకం, రాష్ట్ర ప్రజల ఆకాంక్షని వివరించారు.