
వోల్గా ఆర్చరీ అకాడమీ సందర్శన
Updated on: 2024-10-18 10:22:00

విజయవాడ మహానాడు రోడ్డులోని చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీని ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను ఆర్చరీ అకాడమీ ప్రెసిడెంట్ చెరుకూరి సత్యనారాయణ స్వాగతించి శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆర్చరీ క్రీడాకారులు శాప్ ఛైర్మన్‌ను కలిసి పరిచయం చేసుకున్నారు. ఆర్చరీ క్రీడలో తాము గెలుచుకున్న మెడల్స్ గురించి వివరించారు. శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ అకాడమీకి కావాల్సిన వసతులు, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.