
బాలీవుడ్ నటి జెత్వానీకి షర్మిల సపోర్ట్
Updated on: 2024-09-03 04:52:00

కడప స్టీల్ ప్లాంట్ కట్టించడం చేతకాని మాజీ సీఎం జగన్, సజ్జన్ జిందాల్ ముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపులకు దిగడాన్ని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. జగన్, తానూ మంచి దోస్తులమని సజ్జన్ జిందాల్ గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. ముంబై నటి కాదంబరి జెత్వానీ ఒక కేసు పెడితే ఆమెను తొక్కాలని చూశారన్నారు. నిజంగా కాదంబరి మోసం చేయాలని చూస్తే జిందాల్ ఒక 50నో 100 కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోనేవాడన్నారు. కానీ ఆమె న్యాయం కావాలని నిలబడిందని, ఆమె కలిసి మద్దతు కావాలని అడిగితే నేను పోరాటం చేస్తానని కాదంబరికి షర్మిల హామీ ఇచ్చారు. కేవలం ఫోర్జరీ సంతకం కోసం ఇంతమంది ఉన్నతాధికారులు ఆమె వెనక పడతారా అని ప్రశ్నించారు.