
స్కూల్ ఆయాలు, వాచ్మెన్ల జీతాలు విడుదల
Updated on: 2024-09-03 05:32:00

రాష్ట్రంలో నాడు-నేడు పేరుతో రంగులు వేసి వేలకోట్లు కాజేసిన వైసీపీ పాలకులు పాఠశాలల్లో ఆయాలు, వాచ్మెన్ల జీతాలు బకాయి పెట్టి వెళ్లిపోయారని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. టాయ్‌లెట్ క్లీనింగ్ మెటీరియల్‌కు కూడా నిధులు ఇవ్వలేదని, ఇటీవల పాఠశాల విద్యపై నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారని వివరించారు. సంబంధిత బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆయాలు, వాచ్మెన్ల జీతాలకు రూ.64.38 కోట్లు, టాయ్‌లెట్ క్లీనింగ్ మెటీరియల్‌కు రూ. 23.52 కోట్లు, మొత్తంగా 87.9 కోట్ల బకాయిలు నేడు విడుదలచేశామన్నారు.