
ఏపీ, టీఎస్లకు నారా భువనేశ్వరి భారీ విరాళం
Updated on: 2024-09-04 11:21:00

ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం అందజేశారు. రాష్ట్రానికి రూ. కోటి చొప్పున రెండు రాష్ట్రాలకు రూ. 2కోట్లను హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తరపున అందజేశారు. ఈ మేరకు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది.