
తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ భారీ విరాళం
Updated on: 2024-09-03 05:14:00

రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు నందమూరి బాలకృష్ణ తన వంతుగా భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ సీఎం సహాయనిధికి రూ. 50 లక్షలు, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 50 లక్షలు అందిస్తున్నానని తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో ఈ సాయాన్ని అందిస్తున్నానని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.