
సహాయక చర్యల్లో వైఎస్సార్ సీపీ
Updated on: 2024-09-04 11:43:00

విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ సహాయక చర్యలు కొనసాగిస్తుంది. బుధవారం లక్ష పాల ప్యాకెట్లు, రెండు లక్షల వాటర్ బాటిళ్ల పంపిణీని మొదలుపెట్టింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ వంటి పార్టీ సీనియర్ నాయకులు వరద బాధితులకు మంచినీళ్లు, పాలు, ఆహారాన్ని అందజేస్తోన్నారు. విజయవాడలోని 16,17వ డివిజన్లలో బుధవారం ఉదయం నుంచి పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నారు.