
సీఎంను కలిసిన శాప్ ఛైర్మన్
Updated on: 2025-02-07 10:59:00

ఏపీ సెక్రటేరియట్లో సీఎం నారా చంద్రబాబునాయుడుని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా ఏపీ క్రీడాభివృద్ధికి సంబంధించిన క్రీడాంశాలపై చర్చించారు.ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న క్రీడాప్రోత్సాహకాలను విడుదల చేయడం పట్ల సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే బడ్జెట్లో క్రీడల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని శాప్ ఛైర్మన్ రవినాయుడు సీఎంకు విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర క్రీడాభివృద్ధికి దోహదపడే పలు ప్రతిపాదనలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా నిర్ధిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేస్తే త్వరలోనే అధ్యయనం చేసి కార్యాచరణకు చర్యలు తీసుకుంటామని సీఎం బదులిచ్చినట్లు రవినాయుడు తెలిపారు.