
భద్రాచలంలో ఆరుగురు మావోలు మృతి
Updated on: 2024-09-05 10:00:00

మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా భద్రాచలం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం ప్రాంతం సమీపంలో గురువారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి.మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో తెలంగాణకు చెందిన అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సివుంది.