
మంత్రి అనగానికి ఘనస్వాగతం
Updated on: 2024-10-29 06:18:00

తిరుపతి: రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం తిరుపతి జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి శాప్ ఛైర్మన్ పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.