
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్
Updated on: 2025-05-23 03:45:00

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.