
ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల పర్యటన
Updated on: 2024-09-03 05:20:00

రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం పర్యటించి సహాయక చర్యలను, గట్లు స్థితిని పరిశీలించారు. కొల్లిపర మండలంలోని అత్తులూరివారి పాలెం, వల్లభాపురం, బొమ్మవానిపాలెం గ్రామాల్లో పర్యటించి వరద ఉధృతిపై అధికారులతో చర్చించారు. రైతులకు, ప్రజలకు ధైర్యం చెప్పారు. నిర్వాసితులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకుని ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.