
ముంపు ప్రాంతాల్లో చినరాజప్ప పర్యటన
Updated on: 2024-09-06 11:56:00

విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గత రెండ్రోజులుగా పర్యటిస్తున్నారు. విజయవాడలోని 64వ డివిజన్లో శుక్రవారం ఆయన పర్యటించారు. మోకాలు లోతు నీరున్న ప్రాంతంలో ట్రాక్టర్‌పై పర్యటించి బాధితులకు పాలప్యాకెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్లు, తాగునీరు సరఫరా చేశారు. ముంపు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు.